
గణితం నిజజీవితంలో భాగం
ములుగు: గణితం మానవుడి నిజజీవితంలో ప్రధాన భాగమని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని అన్నారు. శ్రీనివాస రామానుజన్ జయంతిని(గణిత దినోత్సవం) పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో గణిత ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూధన్, ప్రధాన కార్యదర్శి చందా భద్రయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు బుధవారం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎంపికై న విద్యార్థులను అభినందిస్తూ ప్రశంస పత్రాలను అందించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే గణితంపై పట్టు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ ఇనుగాల సూర్యనారాయణ, టీఎంఎఫ్ రాష్ట్ర బాధ్యుడు డాక్టర్ కందాల రామయ్య, సెక్టోరియల్ అధికారి గుల్లపెల్లి సాంబయ్య, జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్, ఏఎస్‌సీఓ సైకం శ్రీనివాస్‌రెడ్డి, సైన్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు శిరుప సతీశ్‌కుమార్, శ్రీనివాస్, సుతారి మురళి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి మ్యాథమెటిక్స్ పోటీలకు ఎంపిక
మంగపేట/వెంకటాపురం(కె)/వాజేడు: శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 22న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి మ్యాథమెటిక్స్ టాలెంట్ పోటీలలో జిల్లా నుంచి పాల్గొనేందుకు పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. మంగపేట మండల పరిధిలోని రాజుపేట జెడ్పీ పాఠశాల విద్యార్థినులు ఎంపిక కాగా హెచ్‌ఎం బానోతు బాలాజీ అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని ననుగొండ నందిని(ఇంగ్లిష్ మీడియం), కానూరి గాయత్రీలక్ష్మి(తెలుగు మీడియం) ప్రథమ స్థానంలో నిలవడం గర్వంగా ఉందని తెలిపారు. వాజేడులోని ఏడ్జర్లపల్లి గ్రామానికి చెందిన చిటమట లక్ష్మిప్రసన్న వెంకటాపురం(కె) మండలంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ పోటీల్లో తృతీయ స్థానం పొంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది.
డీఈఓ పాణిని
Comments
Please login to add a commentAdd a comment