రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
ములుగు: రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు భద్రతా నియమాలను పాటించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల వాల్‌పోస్టర్‌ను కలెక్టరేట్‌లో ఆయన బుధవారం ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 31వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో రోడ్డు భద్రతపై కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం, ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో చిత్రలేఖనం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తామన్నారు. వాహనాల డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. సురక్షిత రవాణాపై పల్లె నుంచి పట్టణాల వరకు ప్రచార యాత్రలు చేపట్టాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ అల్లం రాజ్‌కుమార్, ఎంవీఐ వినోద్‌రెడ్డి, తహసీల్దార్ విజయభాస్కర్, డీపీఆర్వో రఫీక్ పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
Comments
Please login to add a commentAdd a comment