అక్రమ డిప్యుటేషన్లు సరికాదు
మంగపేట : మండల పరిధిలోని అకినేపల్లిమల్లారం మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాల నుంచి అక్రమంగా డిప్యుటేషన్లపై వెళ్లిన ఉపాధ్యాయుల పనితీరు సరైంది కాదని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. వెంటనే డిప్యుటేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పాఠశాల ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలలో విధులు నిర్వహించాల్సిన ఉపాధ్యాయులు వారికి ఇష్టం వచ్చినట్లు ఇతర పాఠశాలలకు అక్రమంగా డిప్యుటేషన్‌పై వెళ్లడంతో విద్యార్థులకు విద్యాబోధన జరగడం లేదన్నారు. వెంటనే పాఠశాల నుంచి వెళ్లిన ఉపాధ్యాయుల డిప్యుటేషన్‌ను రద్దు చేసి తిరిగి పాఠశాలలో విధులకు హాజరయ్యేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment