యూనివర్సిటీ సమాచారం
దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలి
నల్లగొండ రూరల్ : దేశ ప్రగతిలో పౌరులందరూ భాగస్వాములు కావాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి అన్నారు. మంగళవారం ఎంజీయూలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హక్కులతోపాటు ప్రతి పౌరుడు విధులను తెలుసుకోవాలన్నారు. విశ్వవిద్యాలయం విడిచి వెళ్లిన తర్వాత అనేక విచిత్రమైన అనుభవాలు సమాజం నేర్పిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎంబీఏ ప్రిన్సిపాల్ ఎంవీఎన్ రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ పీఓలు శేఖర్, ఆనంద్, స్వప్న, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.
బీఈడీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల
నల్లగొండ రూరల్ : బీఈడీ సెమిస్టర్–2 రెగ్యులర్, బ్యాక్‌లాగ్–2024 ఫలితాలను మంగళవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్‌రెడ్డి విడుదల చేశారు. 2590 మంది విద్యార్థులకు గాను 1813 మంది పాస్ అయ్యారని, 692 మంది విద్యార్థులు ప్రమోట్ కాగా 85 మంది డిటెండ్ అయినట్లు ఉపేందర్‌రెడ్డి తెలిపారు.
ఖోఖో పోటీలకు ఎంజీయూ జట్ల ఎంపిక
నల్లగొండ రూరల్ : అంతర్ విశ్వవిద్యాలయాల ఖోఖో పోటీలకు మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఖోఖో జట్లను మంగళవారం ఎంపిక చేశారు. ఈ నెల 27 నుంచి 31 వరకు తమిళనాడు కేంద్రీయ విశ్వవిద్యాలయం వేదికగా జరుగనున్న పోటీలకు మహిళల, పురుషుల జట్లు పాల్గొంటాయని ఎంజీయూ క్రీడల కార్యదర్శి హరీష్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడా అధికారులు రమావత్ మురళి, శ్యాంసుందర్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment