తిప్పర్తి : భూ తగాదాలతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగి ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన తిప్పర్తి మండలంలోని మామిడాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. తిప్పర్తి ఎస్‌ఐ సాయిప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మామిడాల గ్రామానికి చెందిన గజ్జి శంకర్ అతడి బాబాయ్ గజ్జి లింగయ్య మధ్య కొంతకాలంగా భూ వివాదాలు జరుగుతున్నాయి. మంగళవారం గజ్జి శంకర్, అతడి సోదరులు గజ్జి సైదులు, రామలింగం, శంకర్ భార్య లక్ష్మికాంత, వదిన విజయలక్ష్మి, తల్లి సత్తమ్మలు పొలం పనులు చేస్తున్నారు. ఈక్రమంలో గజ్జి లింగయ్య, అతడి కుమారులు గణేష్, శంకర్, సందీప్, పద్మలు కర్రలు, గొడ్డళ్లు, రాళ్లు, కారం పొడితో వచ్చి గజ్జి శంకర్ కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ ఘటనలో గజ్జి సత్తమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి, వీరిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. గజ్జి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐసాయి ప్రశాంత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment