చోరీకి గురైన ఆటోలు స్వాధీనం
ఆలేరు రూరల్ : దొంగతనానికి గురైన ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆలేరు పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రజనీకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఉన్న మూడు ఆటోలను గత మంగళవారం రాత్రి గుర్తు తెలియన వ్యక్తులు దొంగిలించారు. దీంతో సాయిగూడెం గ్రామానికి చెందిన బాధితుడు మద్దెపాక నరేష్ ఆలేరు పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేశాడు. మంగళవారం పోలీసులు బైపాస్ రోడ్డులోని ఛత్రపతి దాబా సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా ముగ్గురు బాల నేరస్తులు అనుమానాస్పదంగా ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తాము దొంగలించిన మూడు ఆటోలను కోదాడ పట్టణంలో వీరబాబు అనే వ్యక్తికి విక్రయించామని తెలిపారు. ఆటోలను స్వాధీనం చేసుకుని వీరబాబును, బాల నేరస్తులను కోర్టులో హాజరుపరిచామని ఎస్‌ఐ రజనీకర్ తెలిపారు. కేసును చేధించిన సీఐ కొండల్‌రావు, ఎస్‌ఐ రజనీకర్, కానిస్టేబుల్ చంద్రశేఖర్, మహేష్‌లను ఏసీపీ రమేష్ అభినందించారు.
ఆటో చోరీ
భువనగిరి : ఆటో చోరీకి గురైన సంఘటన భువనగిరి మండలంలోని రాయగిరి గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దంతూరి భాస్కర్ ఈ నెల 9వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో ఆటోను తన ఇంటి ఎదుట ఉంచి తాళం వేసి పడుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో నిద్ర లేచి చూసేసరికి ఆటో కనిపించలేదు. దీంతో స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేన్నన్నట్లు ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment