ఏడాదిలో ఎంతో మార్పు
దేవరకొండ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు
ఫ రూ.300 కోట్లతో ఇంటిగ్రేటెడ్
గురుకుల పాఠశాల
ఫ ఏరియా ఆసుపత్రి స్థాయి
200 పడకలకు పెంపు
ఫ రూ.100 కోట్లతో రోడ్ల మరమ్మతులు
ఫ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల పెంపుపై ప్రత్యేక దృష్టి
ఫ నాలుగేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ,
డిండి ఎత్తిపోతల పూర్తి చేయిస్తా
‘సాక్షి’ ఇంటర్వ్యూలో దేవరకొండ
ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్
వైద్యసేవలకు ప్రాధాన్యం
గిరిజన ప్రాంతమైన దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టా. ఇప్పటివరకు అత్యవసర వైద్యం కోసం నల్లగొండ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. దాన్ని దృష్టిలో ఉంచుకుని దేవరకొండ నియోజకవర్గంలో 200 పడకలకు ఆసుపత్రి సామర్థ్యాన్ని పెంచాం. అలాగే అన్నిరకాల వైద్యం అందించేలా ప్రత్యేక వైద్యులను నియమించాం. ప్రస్తుతం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే వైద్యసేవలు అందిస్తున్నాం.
నాణ్యమైన విద్యకు ఇంటిగ్రేటెడ్ స్కూల్
నియోజక వర్గ కేంద్రంలో విద్యార్థులకు మరింత మెరుగైన విద్యనందించేందుకు చర్యలు చేపట్టాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. త్వరలోనే భవన నిర్మాణం పూర్తి చేస్తాం. దీని ద్వారా ఈ ప్రాంతంలోని అన్ని వర్గాల విద్యార్థులకు భోజనం, నివాస సదుపాయంతో కూడిన నాణ్యమైన విద్య అందుబాటులోకి రాబోతోంది.
రోడ్ల పనులకు రూ.100 కోట్లు
నియోజకవర్గంలో రూ.100 కోట్ల నిధులతో గ్రామాలు, గిరిజన తండాల్లో పాడైపోయిన రోడ్ల మరమ్మతులకు చర్యలు చేపట్టాం. కొత్త రోడ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మండల కేంద్రాల నుంచి గ్రామాలకు లింక్ రోడ్లను వేయబోతున్నాం. పీఆర్, ఆర్‌అండ్‌బీ శాఖల ఆధ్వర్యంలో ఈ పనులను చేపడుతున్నాం. మట్టిరోడ్లను తారు మారుస్తాం. ఎస్‌డీఎఫ్ నిధులతో అభివృద్ధికి బాటలు వేస్తాం.
గత పాలకులు చేసింది అంతంతే..
నియోజకవర్గంలో గత పాలకులు చేసిన అభివృద్ధి అంతంత మాత్రమే. చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. అభివృద్ధి కుంటుపడింది. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా రెండు నెలల పాటు పనులు చేపట్టలేకపోయాం. ఆ తర్వాత నుంచి పనులు చేపడుతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment