నియోజకవర్గంలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను త్వరలోనే ప్రారంభించబోతున్నాం. మరికొద్ది రోజుల్లో టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) బేరింగ్ రాబోతోంది. అది వచ్చాక టన్నెల్ తవ్వకం పనులను ప్రారంభిస్తాం. డిండి ఎత్తిపోతల పనులు చేపట్టబోతున్నాం. వచ్చే నాలుగేళ్లలోగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడమే నా ప్రధాన ధ్యేయం. తద్వారా నియోజవకర్గంలో సాగునీటికి ఇబ్బందులు లేకుండా, శాశ్వతంగా కరువు నివారిస్తాం. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశాం. ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని కోరాం. అందుకు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించి నిధులు ఇచ్చేందుకు అంగీంకరించారు. నియోజకవర్గంలో ఐదు పాత ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న కంబాలపల్లి, పెద్దమునిగల్, పొగిళ్ల తదితర ఎత్తిపోతల పథకాల పనులను పూర్తి చేయిస్తా. నేరెడుగొమ్ము మండలం రాములోనిబండ, గాజిపేట చిత్రయాలలో 2 కొత్త లిఫ్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తెస్తా. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే నా ధ్యేయం. నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పరిశ్రమలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నా. ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా.
Comments
Please login to add a commentAdd a comment