ప్రస్తుతం ప్రభుత్వం టీచర్ల పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వడంతో తమకు కావాల్సిన చోటుకు వెళ్లేందుకు ఉపాధ్యాయులు అవతలి ఉపాధ్యాయులతో బేరసారాలు అడుతున్నారు. గతంలో పరస్పర బదిలీలకు అవకాశం ఇచ్చిన సందర్భంలో రూ.10 లక్షలపైనే బేరసారాలు కుదరగా ప్రస్తుతం మాత్రం రూ.15 లక్షలపైన డిమాండ్ పలుకుతున్నట్టు సమాచారం. ప్రధానంగా సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు సంబంధించి నల్లగొండ జిల్లాలో పనిచేసేవారు అధికంగా ఉన్నారు. నల్లగొండ జిల్లా వారు యాదాద్రి జిల్లాలో ఉన్నా పరస్పర బదిలీలకు నల్లగొండకు వచ్చేవారు తక్కువ. హైదరాబాద్‌కు దగ్గర ఉంటుందని ఇక్కడ నుంచి ఆప్షన్ పెట్టుకుని వెళ్లిన వారే అధికంగా ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో పనిచేసే వారు నల్లగొండకు.. నల్లగొండలో పనిచేసేవారు సూర్యాపేట జిల్లాకు పోయేందుకు అవకాశం ఉంది. కొందరు రిటైర్‌మెంట్‌కు దగ్గర ఉన్నవారిని ఎంచుకుని బేరసారాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో వాట్సప్‌లోనే సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు టీచర్లు జిల్లా మారాలనే ఉద్దేశం లేకున్నా డబ్బులు వస్తాయి కదా అని అంగీకరిస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment