‘మ్యూచువల్’కు మస్త్ డిమాండ్!
నల్లగొండ: విద్యాశాఖలో పరస్పర బదిలీ(మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్)లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో తమకు అవసరమైన చోటుకు వెళ్లేందుకు కొందరు ఉపాధ్యాయులు అవతలి వారితో మాట్లాడుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో మ్యూచువల్‌కు మస్త్ డిమాండ్ పెరిగింది. 317 జీఓతో చాలామంది ఉపాధ్యాయులు గతంలో సొంత జిల్లాల నుంచి ఇతర జిల్లాకు బదిలీలపై వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆయా టీచర్లు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు బదిలీలకు అవకాశం కల్పించాలని కొన్నాళ్లుగా ఉపాధ్యాయులు ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నారు.
ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో..
317 జీఓ కారణంగా గతంతో విద్యాశాఖలో పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. అయితే వాటి విషయంలో పరస్పర బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే 317 జీఓతో నల్లగొండ జిల్లా నుంచి చాలా మంది విల్లింగ్‌పైనే యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లారు. కొందరు సూర్యాపేట జిల్లాకు ఇష్టం లేకపోయినా వెళ్లాల్సి వచ్చింది. కానీ, నల్లగొండ జిల్లాకు మాత్రం సూర్యాపేట, యాదాద్రి జిల్లాల నుంచి వివిధ కేటగిరీలకు చెందిన 180 మంది టీచర్లు వచ్చారు. అయితే సూర్యాపేట జిల్లాలో పనిచేసే టీచర్ నల్లగొండ జిల్లాలో పనిచేసే టీచర్ సేమ్ కేటగిరీ అయితే పరస్పర బదిలీలు అయ్యేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఫ విద్యాశాఖలో పరస్పర బదిలీలకు
ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
ఫ ఇష్టమైన చోటుకు వెళ్లేందుకు
కొందరు టీచర్ల ప్రయత్నాలు
ఫ ఇతర జిల్లాలోని ఒకే కేటగిరీ
వారితో బేరసారాలు
ఫ ఒప్పందానికి రూ.15 లక్షలపైనే..
Comments
Please login to add a commentAdd a comment