వందేళ్ల ఉత్సవాల సభకు తరలిరండి
చండూరు: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఈనెల 30న జరిగే సీపీఐ శత వసంతాల ఉత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలోని మాదగోని నరసింహ భవనంలో జరిగిన మునుగోడు నియోజకవర్గస్థాయి కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక, మతోన్మాద విధానాలపై ఐక్య ఉద్యమాలు చేపట్టాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు నలపరాజు రామలింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు గురిజ రామచంద్రం, ఆర్.అంజాచారి, బొలుగూరి నరసింహ, తీర్పారి వెంకటేశ్వర్లు, నలపరాజు సతీష్‌కుమార్, చాపల శ్రీను, ఈదుల భిక్షంరెడ్డి, సుదనబోయిన రమేష్, పల్లె యాదయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఐ జాతీయ సమితి సభ్యుడు
పల్లా వెంకట్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment