వరికొయ్యలను కాల్చొద్దు
మిర్యాలగూడ: రైతులు పంట కోతలు పూర్తయ్యాక వరికొయ్యలను కాల్చవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (డీఏఓ) శ్రవణ్‌కుమార్ సూచించారు. మంగళవారం దామరచర్ల మండలం దిలావర్‌పూర్‌లో రైతుల పంట పొలాలను ఆయన సందర్శించి మాట్లాడారు. రైతులు తమ వరి కొయ్యలను కాల్చడం ద్వారా భూమిలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, మిత్ర పురుగులు, వానపాములు, అనేక సూక్ష్మ పోషకాలు నశిస్తాయన్నారు. రైతులు డీఏపీ ఎరువులకు బదులుగా సింగిల్ సూపర్ ఫాస్పేట్, నానో డీఏపీ భాస్వరాన్ని కలిగించే బ్యాక్టిరియాను వాడాలన్నారు. అనంతరం మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఎరువులు, విత్తనాలను ఈ పాస్ మిషన్ ద్వారానే అమ్మాలన్నారు. ఆయన వెంట ఏఈఓ సైదులు, రైతులు నాగిరెడ్డి, రాజేష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాములు ఉన్నారు.
ఫ డీఏఓ శ్రవణ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment