జిల్లా సమగ్రాభివృద్ధికి పోరుబాట
నల్లగొండ టూటౌన్: జిల్లా సమగ్రాభివృద్ధికి సీపీఎం ఆధ్వర్యంలో నిరంతరం పోరాడుతామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని దొడ్డి కొమురయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తికి ఈ బడ్జెట్‌లో సరిపడా నిధులు కేటాయించాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాటలతోనే కాలం వెళ్లదీస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లపై స్పష్టత ఇవ్వాలన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాకుండా శాశ్వత పరిష్కారం చూపడం లేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, బండ శ్రీశైలం, చిన్నపాక లక్ష్మీనారాయణ, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, కందాల ప్రమీల, వీరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment