దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Published Fri, Sep 27 2024 2:24 AM | Last Updated on Fri, Sep 27 2024 2:24 AM

దరఖాస

నంద్యాల(అర్బన్‌): మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో కొనసాగుతున్న సఖీ–1 స్టాఫ్‌ సెంటర్‌ (మిషన్‌ శక్తి–సంబల్‌)లో సిబ్బంది ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు అభివృద్ధి, సాధికార అధికారిణి లీలావతి గురువారం ఒక ప్రకటనలో కోరారు. సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ కేసు వర్కర్‌, పారా లీగల్‌ పర్సనల్‌, సోషల్‌ కౌన్సిలర్‌ పోస్టులకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. చైర్మన్‌, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో గతనెల 31న జరిగిన మౌఖిక ఇంటర్వ్యూలో అభ్యర్థుల వివరణలతో సంతృప్తి చెందని కారణంగా ఈ పోస్టులకు తిరిగి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. వివరాలలకు వెబ్‌సైట్‌ https://nandyalap.gov.inను పరిశీలించాలన్నారు.

3 నుంచి దేవీశరన్నవరాత్రోత్సవాలు

బనగానపల్లె రూరల్‌: మండలంలోని నందవరం గ్రామంలో వెలసిన చౌడేశ్వరిదేవి ఆలయంలో వచ్చేనెల 3 నుంచి 12వ తేది వరకు దేవీశరన్నవరాత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ కామేశ్వరమ్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అక్టోబరు 3వ తేదీన శ్రీ శైల పుత్రిదేవి అలంకారం, 4న శ్రీ బ్రహ్మచారిణి, 5న శ్రీ చంద్ర ఘంట, 6న కూష్మాండ , 7న స్కాందమాత, 8న కాత్యాయణి, 9న కాళరాత్రి, 10న మహాగౌరి, 11న సిద్ధిధాత్రి, 12న చౌడేశ్వరిదేవి అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ తెలిపారు.

శ్రీశైల దేవస్థానానికి రూ. 4 లక్షల విరాళం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న పలు సేవా పథకాలకు గురువారం ఇద్దరు భక్తులు రూ. 4 లక్షల విరాళం అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన రామాంజనేయులు అన్నప్రసాద వితరణకు రూ.1,00, 100, గోసంరక్షణనిధి పథకానికి రూ.1,00,100, ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1,00,100.. మొత్తం మూడు పథకాలకు రూ.3,00,300 విరాళాన్ని ఆలయ పర్యవేక్షకురాలు టి.హిమబిందుకు అందజేశారు. అలాగే చత్తీస్‌ఘడ్‌కు చెందిన బి.విజయ మౌనిక, బైలాలి రూ.1,11,100 విరాళాన్ని దేవస్థాన సహాయ కమిషనర్‌ ఇ.చంద్రశేఖర్‌రెడ్డికి అందజేశారు. విరాళాలను అందజేసిన దాతలకు దేవస్థానం తరుపున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలను, జ్ఞాపిక అందించి సత్కరించారు.

కర్నూలు డీపీఓ ఎవరు ?

కర్నూలు(అర్బన్‌): జిల్లా పంచాయతీ అధికారి ఎవరన్న సందిగ్ధత నెలకొంది. ఇక్కడ డీపీఓగా విధులు నిర్వహిస్తున్న టి.నాగరాజునాయుడును అనంతపురం డీపీఓగా బదిలీ చేస్తూ ఈ నెల 22న పీఆర్‌అండ్‌ఆర్‌డీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అదే ఉత్తర్వుల్లో కర్నూలు డీపీఓగా ఇద్దరికి పోస్టింగ్‌ ఇస్తున్నట్లు పేర్కొంది. విజయవాడలో జీఎస్‌డబ్ల్యూఎస్‌ అడిషనల్‌ కమిషనర్‌గా డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న ఎన్‌.రాంనాథ్‌రెడ్డికి, అలాగే కర్నూలు డ్వామాలో డీవీఓగా విధులు నిర్వహిస్తున్న జి.భాస్కర్‌కు కర్నూలు డీపీఓగా పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
దరఖాస్తుల ఆహ్వానం 1
1/1

దరఖాస్తుల ఆహ్వానం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement