వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం.. | Mother of four Youth Love with Daughter father-in-law In UP | Sakshi
Sakshi News home page

వావి వరసలు మరచి.. కూతురి మామతో ప్రేమాయణం.. భర్త ఇంట్లో లేని సమయంలో..

Apr 19 2025 8:09 AM | Updated on Apr 19 2025 9:33 AM

Mother of four Youth Love with Daughter father-in-law In UP

ఈరోజుల్లో బంధాలకు విలువ లేకుండా పోతోంది. వావివరుసలు మరిచి విపరీత పోకడలకు పోతున్నారు కొందరు.  తనకు కాబోయే అల్లుడితో అత్త జంప్‌ అయిన ఘటన మరువక ముందే.. అలాంటి దరిద్రపు ఘటనే యూపీ బదౌన్‌లో వెలుగుచూసింది. ఓ మహిళ.. తన కూతురి మామతోనే సంబంధం పెట్టుకుంది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన వారిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

వివరాల ప్రకారం.. డేటాగంజ్ కొత్వాలి ప్రాంతానికి చెందిన సునీల్, మమత(43)కు 2002లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సునీల్‌ ట్రక్క్‌ నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా, తన పెద్ద కుమార్తెను బదౌన్ సదర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన శైలేంద్ర కుమారుడికి ఇచ్చి 2022లో వివాహం చేశాడు. 

అయితే, తన కూతురికి వివాహం చేసిన అనంతరం కూతురు మామ అయిన శైలేంద్రతో మమత ప్రేమలో పడింది. దాదాపుగా రెండేళ్ల నుంచి వీరి మధ్య సంబంధం నడిచింది. సునీల్‌ ట్రక్క్‌ నడుపుతున్న కారణంగా నెలలో కొద్దిరోజులు మాత్రమే ఇంట్లో ఉండేవాడు. సునీల్‌ లేని సమయంలో శైలేంద్ర.. మమత ఇంటికి వచ్చేవాడు. ఇద్దరూ వరుసకు  అన్నాచెల్లెలు కావడంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఈ క్రమంలో ప్రేమాయణం నడిపిన మమత, శైలేంద్ర.. తాజాగా ఇంటి నుంచి పారిపోయారు. దీంతో, వీరి సంబంధం గురించి బయటి ప్రపంచానికి తెలిపింది.

భర్త ఆవేదన..
ఈ నేపథ్యంలో బాధితుడు, భర్త సునీల్.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా సునీల్‌ మాట్లాడుతూ.. నేను వేరే ఊరిలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను.. అయినప్పటికి నా భార్యకు సమయానికి డబ్బు పంపిస్తున్నాను. కుటుంబ ఖర్చులకు డబ్బు ఇచ్చేవాడిని. నా భార్య నేను లేనప్పుడు.. శైలేంద్రకు ఫోన్‌ చేసి మాట్లాడింది. అతడిని ఇంటికి రావాలని చెప్పింది. ఇప్పుడు అతనితో పారిపోయింది. ఆమె ఇంట్లో ఉన్న నగలు, డబ్బు అంతా తీసుకుని పారిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు.

బిడ్డల ముందే..
మరోవైపు.. మమత కుమారుడు మాట్లాడుతూ.. మా తండ్రి ఇంట్లో లేనప్పుడు మామ శైలేంద్ర మా ఇంటికి వచ్చేవారు. మా తండ్రి ఇంట్లో లేనప్పుడు అమ్మ ప్రతి మూడు రోజులకు ఒకసారి ఆయనకు ఫోన్ చేసేది. మామ.. మా ఇంటికి వచ్చిన ప్రతీసారి మమ్మల్ని వేరే గదికి పంపించారు. ఆమె తన మామతో కలిసి టెంపోలో పారిపోయిందని చెప్పారు. అలాగే, ఈ ఘటనపై స్థానికులు స్పందిస్తూ.. సునీల్ వేరే చోట్ల ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తుండే వాడు. నెలలో రెండు మూడుసార్లు మాత్రమే ఇంటికి వచ్చేవాడు. భర్త దూరంగా ఉండటంతో మమత.. శైలేంద్రను ఆహ్వానించేది. అతను రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చి తెల్లవారుజామున వెళ్లిపోయేవాడని చెప్పారు. అతనే మమతను తీసుకెళ్లాడని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement