
కడలూరు: తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రుతి సమీపంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి.. దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఓ మహిళలను చెట్టుకు కట్టేసి విచక్షణా రహితంగా దాడి చేయడంతో పాటు వివస్త్రను చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నలుగురు మహిళలలు కలిసి ఓ మహిళను ఆమె చీరతోనే చెట్టుకు కట్టేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
‘‘నువ్వు కుక్కతో సమానం’’ అంటూ బాధితురాలిని ఓ మహిళ అసభ్యకరంగా తిడుతుండగా, మరొకరు కర్రతో దాడి చేశారు. మరొ మహిళ ఆమె జట్టుపట్టుకుని లాగుతూ.. బాధితురాలి జాకెట్‌ను చించివేసింది. ఒక మహిళ ఈ దాడిని వీడియో తీస్తూ.. ఇలా చేస్తే జైలుకెళ్తారంటూ హెచ్చరించినా కూడా మిగతా వారు పట్టించుకోలేదు. సమారు 2.13 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఫుటేజ్ వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు మహిళలో ఒకరు అరెస్టు కాగా, మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు.
భూ వివాదం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న వారిని గాలించడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. దాడికి కుల వివక్ష కారణమా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.