సర్వే వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి
● జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్
సారంగపూర్: ప్రతీరోజు గ్రామాల్లో చేపడుతున్న సమగ్ర సర్వే వివరాలను ఏరోజుకారోజు ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో డాటా ఎంట్రీ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఇప్పటిరకు ఎన్ని కుటుంబాల వివరాలను ఆన్లైన్ చేశారని అడిగి తెలుసుకున్నారు. ఎన్యుమరేటర్లు చేపట్టిన సర్వే ఫారాలు ఏఒక్కటి మిస్సవ్వకుండా అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఆన్లైన్లో పొందుపరచాలని తెలిపారు. అనంతరం మండలంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను, అలాగే నర్సరీ పనులను గురించి ఎంపీడీవో లక్ష్మీకాంత్రావును అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట తహసీల్దార్ శ్రీదేవి, మండల ప్రత్యేకాధికారి బాలిక్ అహ్మద్, ఎంపీవో అజీజ్‌ఖాన్, ఏపీవో లక్ష్మారెడ్డి, ఆపరేటర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment