భైంసాటౌన్: పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్ఎంఎంఎస్(నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్) పరీక్ష కేంద్రాన్ని పరీక్షల నియంత్రణ అధికారి పద్మ శుక్రవారం తనిఖీ చేశారు. ఏర్పాట్లపై హెచ్ఎం గంగాప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించివారికి తొమ్మిది నుంచి ఇంటర్ వరకు స్కాలర్షిప్ అందుతుందన్నారు. ఈనెల 24న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 963 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు చెప్పారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
కేంద్రాన్ని పరిశీలిస్తున్న పరీక్షల అధికారి పద్మ
Comments
Please login to add a commentAdd a comment