
మాతా శిశు మరణాలు తగ్గించాలి
నిజామాబాద్‌నాగారం: మాతా శిశు మరణాలను తగ్గించాలని, గర్భిణులు, బాలింతలకు అందించే సేవలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమంపై ముద్రించిన కరదీపికలను కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిస్క్‌లో ఉన్న గర్భిణులను ముందే గుర్తించి బర్త్ ప్లానింగ్ నిర్వహించడంతో మాతా శిశు మరణాలను తగ్గించొచ్చన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్, మెప్మా పీడీ రాజేందర్, డీపీవో శ్రీనివాస్, ఏసీపీ రాజావెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య సేవలను ఉపయోగించుకోవాలి
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అందించే ఉచిత సేవలను మహిళలు ఉపయోగించుకోవాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ సూచించారు. నగరంలోని మాలపల్లి ఆరోగ్య కేంద్రంలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. మహిళలు రక్తహీనతను అధిగమించాలని, గర్భధారణ సమయంలో ప్రభుత్వ వైద్యులతో కనీసం ఆరుసార్లు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సహిస్తా పర్వీన్, డీపీహెచ్‌ఎన్‌వో స్వామి సులోచన, డీహెచ్‌ఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు