
బంగారం దుకాణంలో చోరీ
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఉన్న ఓ బంగారం దుకాణంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రంలోని బంగారు దుకాణాన్ని మంగళవారం ఉదయం నిర్వాహకులు తెరచి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. గుర్తుతెలియని దుండగుడు సోమవారం అర్ధరాత్రి దుకాణం వెనుక ఉన్న తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడి సొత్తును దొంగలించినట్లు తెలిపారు. సుమారుగా 17కిలోల వెండి, 6తులాల బంగారం చోరీ చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఈమేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినల్లు ఎస్సై రాజు తెలిపారు.
ఆలయంలో చోరీకి విఫలయత్నం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ సమీపంలోని రేణుకామాత ఆలయంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి విఫలయత్నం చేశారు. ఆలయంలోని హుండీని పగులగోట్టేందుకు వారు ప్రయత్నించినప్పటికీ హుండీ తలుపు తెరుచుకోకపోవడంతో దుండగులు వెనుదిరిగారు. మంగళవారం ఉదయం ఆలయాన్ని శుభ్రపర్చేందుకు వచ్చినవారు హుండీ తలుపు ధ్వంసమై ఉండడాన్ని గమనించి ఆలయకమిటీ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆలయకమిటీ సభ్యులు అక్కడికి చేరుకొని, నాగిరెడ్డిపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆలయానికి చేరుకొని హుండీని పరిశీలించి, వివరాలు సేకరించారు.

బంగారం దుకాణంలో చోరీ