
ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఈగ సంజీవ్‌రెడ్డి
నిజామాబాద్ నాగారం: ఆర్చరీ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. జిల్లా కేంద్రంలోని సంజీవరెడ్డి నగర్ కాలనీలో ఆదివారం అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్ రావడంతో కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి గంట ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా ఈగ సంజీవరెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎంవీ సుబ్బారావు, కోశాధికారిగా మంథని బాలగంగాధర్, ప్రధాన కార్యదర్శిగా కే గంగరాజు, సంయుక్త కార్యదర్శిగా ఈగ పోతన్న, సభ్యుడిగా బదావత్ గణేశ్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ నాలుగేళ్లపాటు కొనసాగనున్నది. ఎన్నికల అబ్జర్వర్లుగా అరవింద్‌కుమార్, అంద్యాల లింగన్న, మీసాల ప్రశాంత్‌కుమార్ వ్యవహరించారు. ఈగ సంజీవరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని, క్రీడాకారులకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఆర్చరీ క్రీడాకారుడినైన తాను జిల్లాకు చెందిన క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దుతానని ప్రధాన కార్యదర్శి గంగరాజు పేర్కొన్నారు. కార్యక్రమంలో బోర్గాం సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, గాధరి సంజీవరెడ్డి, సయ్యద్ నబీ తదితరులు పాల్గొన్నారు.
ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక