బార్‌ అసోసియేషన్‌ ప్రమాణ స్వీకారం | - | Sakshi
Sakshi News home page

బార్‌ అసోసియేషన్‌ ప్రమాణ స్వీకారం

Apr 15 2025 2:00 AM | Updated on Apr 15 2025 2:00 AM

బార్‌

బార్‌ అసోసియేషన్‌ ప్రమాణ స్వీకారం

ఖలీల్‌వాడి: నగరంలో సోమవారం నిజామాబా ద్‌ బార్‌ అసొసియేషన్‌ నూతన కార్యవర్గం ప్ర మాణ స్వీకారం నిర్వహించారు. అధ్యక్షుడు సా యరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్‌రాజు, మహి ళా ప్రతినిధి రమాదేవి, కోశాధికారి నారాయణ దాస్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అ ధికారి వెంకటేశ్వర్‌, కమిటీ సభ్యులు ఆకుల రమే ష్‌, నరసింహరెడ్డి, బాస రాజేశ్వర్‌, మాజీ అ ధ్యక్షుడు జగన్‌మోహన్‌గౌడ్‌, సుదర్శన్‌ పాల్గొన్నా రు. ఎన్నికలు ఆలస్యంగా జరిగినందున నలుగురితో ప్రమాణ స్వీకారం చేయించారు. మిగితా వారితో త్వరలో ప్రమాణ స్వీకారం చేయి స్తామని అధ్యక్షుడు సాయ రెడ్డి తెలిపారు.

‘భూభారతి’ ప్రారంభ

కార్యక్రమాన్ని తిలకించిన రైతులు

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డి రైతు వేదికలో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భూ భారతి పోర్టల్‌ ప్రారంభ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్‌, మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, రైతులు తిలకించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రజాపతి, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సంగారెడ్డి, సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు లింగాగౌడ్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మద్దెల బాగయ్య, సీడీసీ చైర్మన్‌ ఇర్షాదొద్దిన్‌, విండో చైర్మన్‌ సదాశివరెడ్డి, సాదీక్‌ అలీ, తదితరులు పాల్గొన్నారు.

మహమ్మద్‌ నగర్‌ రైతువేదికలో..

నిజాంసాగర్‌(జుక్కల్‌): మహమ్మద్‌ నగర్‌లోని రైతువేదికలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భూ భారతి పోర్టల్‌ ప్రారంభ కార్యక్రమాన్ని పిట్లం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చీకోటి మనోజ్‌కుమార్‌, అధికారులతో కలిసి తిలకించారు.కార్యక్రమంలో మహమ్మద్‌ నగర్‌, నిజాంసాగర్‌ మండలాల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, ఏలే. మల్లికార్జున్‌, మహమ్మద్‌ నగర్‌ మండల వ్యవసాయశాఖ అధికారిణి నవ్య, ఏఈవోలు మధుసూదన్‌, రేణుక, రైతులు ఉన్నారు.

కల్తీ కల్లు బాధితులకు

నష్టపరిహారం ఇవ్వాలి

బాన్సువాడ : కల్తీ కల్లు సేవించి ఆస్పత్రి పాలైన బాధితులందరికి నష్టపరిహారం ఇవ్వాలని పౌరహక్కులసంఘం నిజనిర్ధారణ కమిటీ సభ్యులు డిమాండ్‌ చేశారు. సోమవారం నస్రుల్లాబాద్‌ మండలం దుర్కి, అంకోల్‌, అంకోల్‌తండా గ్రా మాల్లో కమిటీ సభ్యులు పర్యటించారు. ఇటీ వల కల్తీకల్లు సేవించి ఆస్పత్రి పాలైన బాధితులను కలిసి వివరాలు సేకరించారు. కల్లు బాధితులందరికి ఒక్కొక్కరికి రూ. లక్ష నష్టపరిహారాన్ని కల్తీ కల్లు కాంట్రాక్టరు వద్ద ఇప్పించాలని వారు డిమాండ్‌ చేశారు. మత్తు, పదార్థాలైన డైజోఫాం, క్లోరోఫాం రవాణాను అరికట్టాలన్నా రు.అర్హులైన గీత కార్మికులకు మాత్రమే లైసెన్సు లు ఇవ్వాలని, గీత కార్మికులందరికి నెలకు రూ. 3 వేల పింఛను ఇవ్వాలని, గీత పారిశ్రామిక సహకార సొసైటీలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. కల్తీ కల్లు తయారు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సభ్యులు అల్గోట్‌ రవీందర్‌, సంగం, ఎడ్ల రాజు, గైని శ్రీనివాస్‌ తదితరులున్నారు.

బార్‌ అసోసియేషన్‌ ప్రమాణ స్వీకారం
1
1/2

బార్‌ అసోసియేషన్‌ ప్రమాణ స్వీకారం

బార్‌ అసోసియేషన్‌ ప్రమాణ స్వీకారం
2
2/2

బార్‌ అసోసియేషన్‌ ప్రమాణ స్వీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement