దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Outsourcing jobs for heirs of Dubai victims | Sakshi
Sakshi News home page

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

Apr 17 2025 5:19 PM | Updated on Apr 17 2025 8:20 PM

Outsourcing jobs for heirs of Dubai victims

జపాన్ పర్యటన నుంచి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి 

మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించాలని అధికారులను ఆదేశించిన సీఎం 

ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. 

నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్‌ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. 

మరిన్ని NRI  వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి:

ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement