సీఐటీయూ జాతీయ కార్యదర్శి
కామ్రేడ్ ఆర్.సింధు
పెనమలూరు: దేశంలోని కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం నిరంతర పోరాటంతోనే సాధ్యమవుతుందని సీఐటీయూ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ ఆర్.సింధు అన్నారు. కాన్‌ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కార్మికుల (సీసీజీఈడబ్ల్యూ) 6వ జాతీయ స్థాయి రెండు రోజుల సదస్సు కృష్ణాజిల్లా పోరంకిలో శుక్రవారం ప్రారంభమయింది. ముఖ్యఅతిథిగా హాజరైన సింధు మాట్లాడుతూ మారుతున్న కాలంతో పాటు మహిళా ఉద్యోగుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న చట్టాల కంటే మరింత కఠినమైన చట్టాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులు బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్యాలయాలలో నిర్లక్ష్యం చేయకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సీసీజీఈడబ్ల్యూ జాతీయ అధ్యక్షురాలు రూపక్‌సర్కార్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులపై జరుగుతున్న అగాయిత్యాలపై విచారణ 90 రోజుల్లో పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కామ్రేడ్ ఆర్. సీతాలక్ష్మికి ఘన నివాళులర్పించారు. వివిధ సంఘాల నేతలు అజీజ్, మనీషా ముంజుందార్, ఐ.సుశీలరాణి, బోనేపల్లి ఉష, ఎస్‌బి.యాదవ్, కె.రమాదేవి, ఎం.రాజ్యలక్ష్మి, వి.నాగేశ్వరరావు, కెవీ.రమణారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment