కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరం
లబ్బీపేట(విజయవాడతూర్పు): పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వలనే అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది వచ్చిన భారీ వర్షాలకు బెజవాడ సగం మునిగింది. అధిక కాలుష్య ప్రభావమే అందుకు కారణమంటున్నారు. ఢిల్లీ, చైన్నె, ముంబయి, హైదరాబాద్ నగరాల తర్వాత బెజవాడలోనే వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటోంది. దీంతో భూమిపై నుంచి 15 మీటర్ల వరకూ గాలిలో వాస్తవంగా ఉండాల్సిన ఆక్సిజన్ శాతం కంటే తక్కువగా ఉంటోంది. అందువలన విషవాయువులు అధికంగా శరీరంలోకి చేరి ఊపిరితిత్తులు, గుండె, న్యూరోలాజికల్, నేత్ర సంబంధ వ్యాధులతో పాటు, క్యాన్సర్‌కు ఇవి మూలకారణంగా మారుతున్నాయి.
విపరీతంగా పెరిగిన వాహనాల సంఖ్య
ఆరోగ్యకరమైన నగరంలో ప్రతి లక్ష మంది జనాభాకు 5 వేల వాహనాలు ఉండాలి. అంతకు మించి ఉంటే గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలి. ఈ లెక్కన విజయవాడ జనాభా 12 లక్షలు కాగా, 60 వేలు ఉండాలి. కానీ ప్రస్తుతం 6.90 లక్షల వాహనాలు ఉన్నట్లు అంచనా. వీటిలో ట్రాన్స్‌పోర్టు వాహనాలు 97 వేలు, మోటారు సైకిళ్లు 5.11 లక్షలు. నగరం మీదుగా జాతీయ రహదారిపై రోజుకు 40 వేల వరకూ వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. నగరంలో సిటీ బస్సుల్లో అధికశాతం 10 లక్షలకు పైగా కిలోమీటర్లు తిరిగినవే ఉన్నాయి. ఇలా కాలం చెల్లిన బస్సులు, ఇతర వాహనాల నుంచి సల్ఫర్ డై ఆకై ్సడ్, నైట్రిక్ ఆకై ్సడ్, కార్బన్ మోనా కై ్సడ్, కార్బన్ డై ఆకై ్సడ్ వెలువడుతోంది.
వ్యర్థం...అనర్థం
విజయవాడ నగరంలో రోజుకు 600 మెట్రిక్ టన్నుల తడి–పొడి చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను రీ సైక్లింగ్ చేసేందుకు సైంటిఫిక్ డంపింగ్ యార్డులు లేవు. ప్రస్తుతం చెత్త సేకరణ కూడా సరిగ్గా జరగడం లేదు. చెప్పుల వ్యర్థాలను కాల్వగట్ల వెంబడి పడేసి ఒకేసారి కాల్చేస్తున్నారు. ఇలా చేయడం వలన మిథేన్, బొగ్గు వాయువులు, కార్బన్ డై ఆకై ్సడ్ వంటివి గాలిలో కలుస్తున్నాయి. దీంతో గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గి ఇతర విషవాయువులు పెరుగుతున్నాయి.
రీ–రేడియేషన్ ప్రభావము ఎక్కువే
విజయవాడలో 20 కిలోమీటర్ల పరిధిలో బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో దాదాపు వృక్షాలన్నీ కూల్చేశారు. ఎండ తీవ్రతకు వచ్చే ఉష్ణాన్ని ఇంటి శ్లాబ్, సీసీ రోడ్లు పీల్చుకుని, రాత్రుళ్లు వేడిని తిరిగి విడుదల (రీ రేడియేషన్) చేస్తున్నాయి. రాత్రి ఉష్ణోగ్రత సాధారణంగా 28 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా, 32 నుంచి 34 డిగ్రీల స్థాయిలో వేడిగా ఉండటమే ఇందుకు ఉదాహరణ.
తగ్గిన ఆక్సిజన్ శాతం
వాస్తవానికి గాలిలో 18 నుంచి 10 శాతం ఆక్సిజన్, 75 శాతం వరకూ నైట్రోజన్, 0.6 శాతం కార్బన్ డై ఆకై ్సడ్, ఇతర వాయువులు 1.4 శాతం ఉంటాయి. నగరంలో కాలుష్యం కారణంగా గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గినట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.
విజయవాడ లోనే 6.5 లక్షలకు చేరిన వాహనాలు గాలిలో తగ్గుతున్న ఆక్సిజన్ శాతం ప్రమాదమేనంటున్న పర్యావరణ వేత్తలు
వాయు కాలుష్యంతో వ్యాధులు
వాయు కాలుష్యం కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక శ్యాసకోశ వ్యాధులతో పాటు, ఎక్కువ కాలం కాలుష్య ప్రభావానికి గురైన వారిలో జన్యుపరమైన లోపాలు తలెత్తి క్యాన్సర్ సోకే అవకాశం ఉంది. చర్మ వ్యాధులతో పాటు, లంగ్స్ దెబ్బతినడంతో ఆ ప్రభావం గుండైపె పడుతుంది. కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మాస్కులు ధరించడం ఉత్తమం –డాక్టర్ దుర్గాప్రసాద్,
జనరల్ ఫిజీషియన్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment