వరకట్న వేధింపు కేసులో ఇద్దరికి జైలుశిక్ష | - | Sakshi
Sakshi News home page

వరకట్న వేధింపు కేసులో ఇద్దరికి జైలుశిక్ష

Published Sat, May 18 2024 5:25 AM | Last Updated on Sat, May 18 2024 5:25 AM

-

హిరమండలం:

రకట్న వేధింపుల కేసులో భర్త, అత్తలకు ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ సోంపేట సెషన్స్‌ కోర్టు తీర్పు చెప్పింది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ జి.నారాయణస్వామి అందించిన వివరాలిలా ఉన్నాయి. తంప గ్రామానికి చెందిన పెంటల హారతి అనే వివాహిత 2020 సంవత్సరంలో ఆత్మహత్య చేసుకుంది. భర్త బోయితి తిరుమలరావు, అత్త లిమ్మమ్మ వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో పుట్టింటి వారి ఫి ర్యాదులతో కేసు నమోదు చేసిన పాలకొండ డీఎస్పీ రారాజు ప్రసాద్‌ కేసు నమోదు చేశారు. నిందితులపై అభియోగాలు మోపుతూ కేసు వేశారు. పలుమార్లు విచారణ కొనసాగింది. శుక్రవారం కోర్టులో విచారణ జరిగింది. నిందితులపై నేరారోపణలు రుజువు కావడంతో న్యాయమూర్తి టి.భాస్కరరావు తీర్పు చెప్పారు. భర్త తిరుపతిరావుతో పాటు అత్త లిమ్మమ్మలకు ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించారు. బాధితుల తరఫున పీపీ కె.వెంకటరావు వాదించారు. హిరమండలం ఎస్‌ఐ నారాయణస్వామి నిందితులను హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను రిమాండ్‌కు తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement