సీతానగరం: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ సీతానగరం సర్కిల్ పరిధిలో ఉన్న గరుగుబిల్లి మండల కేంద్రం ప్రధాన రహదారిపై సోదాలు చేస్తుండగా ఒకవ్యక్తి దగ్గరున్న ప్లాస్టిక్ సంచిలో 300 సారా ప్యాకెట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ డి. పద్మావతి తెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ మంగళవారం మూడు మండలాల్లో సిబ్బందితో ప్రధాన రహదారుల్లో వాహనాలు సోదా చేశామన్నారు. ఈ సోదాల్లో గురుగుబిల్లి మండలకేంద్రం సమీపంలో సారా ప్యాకెట్లతో పట్టుబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరు పర్చగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. సర్కిల్ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయించినా, బెల్ట్‌షాపులు నిర్వహించినా, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయాలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
30 మద్యం బాటిల్స్ స్వాధీనం
బొబ్బిలిరూరల్: మండలంలోని కొత్త పెంట గ్రా మానికి చెందిన బొబ్బిలి రాంబాబు అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఈ మేరకు ఏఎస్సై భాస్కరరావు చెప్పిన వివరాల ప్రకారం సాయంత్రం బొబ్బిలి నుంచి కొత్త పెంట గ్రామానికి తరలించేందుకు సిధ్దం చేసిన 30 మద్యం బాటిల్స్‌ను గొల్లవీధి జంక్షన్‌లో పట్టుకుని రాంబాబును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్సై భాస్కర్రావు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment