అనారోగ్య శిశువు జన్మించకూడదు
విజయనగరం ఫోర్ట్: రానున్న రోజుల్లో జిల్లాలో ఆరోగ్యపరమైన లోపాలతో ఏ ఒక్క శిశువూ జన్మించకూండా చూడాలనే లక్ష్యంతో అన్ని శాఖలు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ బీఆర్. అంబేడ్కర్ అన్నారు. కిశోరీ బాలికల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను కిందిస్థాయి వరకు తీసుకువెళ్లి అవగాహన కల్పించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని అభిప్రాయ పడ్డారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కిశోరీ వికాసం కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న ప్రసవాల్లో 6 శాతం మంది పిల్లలు రక్తహీనత, మరికొంతమంది తగిన బరువు లేకుండా, ఇతర లోపాలతో పుడుతున్నారన్నారు. తక్కువ వయసులో జరిగే వివాహాలు, తగిన పోషకాహారం తీసుకోకపోవడం వంటి కారణాలే గర్భిణుల్లో అనారోగ్యానికి దారితీస్తున్నాయనే విషయాన్ని అర్థమయ్యేలా తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ కేసలి అప్పారావు, డీఈఓ మాణిక్యం నాయుడు, ఐసీడీఎస్ పీడీ శాంతకుమారి, డీసీపీయూ యాళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment