ఘనంగా ముగిసిన శ్రీ నృత్యోత్సవం
భువనేశ్వర్: స్థానిక రవీంద్ర మండపంలో శ్రీ డ్యాన్స్ అకాడమీ నిర్వహించిన శ్రీ నృత్యోత్సవం–2024 ఆదివారంతో ముగిసింది. ప్రముఖ కళాకారుల సోలో, యుగళ బృందం ఒడిస్సీ ప్రదర్శనలు నృత్య కళాప్రియుల్ని అలరించాయి. ఈ ఉత్సవంలో పాల్గొన్న కళాకారులకు ప్రత్యేకంగా సత్కరించి అవార్డులు ప్రదానం చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు ఉత్సవానికి ప్రముఖ రచయిత, ఆకాశవాణి మాజీ స్టేషన్ డైరెక్టర్ సంతాను రథ్, చేనేత, జౌళి–హస్తకళల శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఉత్కళిక మేనేజింగ్ డైరెక్టర్ మధుమితా రథ్, ప్రముఖ ఒడిస్సీ నృత్య కళాకారిణి రాజశ్రీ చింతక్, పారాదీప్ ఫాస్ఫేట్ లిమిటెడ్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి సుధి రంజన్ మిశ్రా తదితర ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రదర్శనలో శ్రీ డాన్సు అకాడమీ బృందం పరం బ్రహ్మ పూర్ణ బ్రహ్మ ఒడిస్సీ నృత్యం, ఒడిస్సీ నృత్యం గురు అలోకా కనుంగో సోలో ఒడిస్సీ నృత్యం, స్వప్న రాణి సిన్హా, అంకిత రథ్ కృష్ణాష్టకం యుగళ ఒడిస్సీ యుగళ నృత్యం, శ్రీ రాధా కళాకుంజ్ నృత్య బృందం పంచ పరమేశ్వర్ ఒడిస్సీ నృత్య ప్రదర్శనతో రెండు రోజుల శ్రీ నృత్యోత్సవానికి తెర పడింది.
ఘనంగా ముగిసిన శ్రీ నృత్యోత్సవం
Comments
Please login to add a commentAdd a comment