కేంద్రమంత్రితో ఎంపీల భేటీ
భువనేశ్వర్: రాష్ట్ర ఎంపీలు కేంద్ర విద్యాశాఖ మంత్రి, సంబలపూర్ లోక్‌సభ సభ్యుడు ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయడుతో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు విమానయాన సౌకర్యాల సంబంధిత ప్రతిపాదనలతో వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, కొత్త టెర్మినల్స్, విమానాశ్రయ విస్తరణ, అనుసంధాన నిర్మాణాలు, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచాలని అభ్యర్థించారు. స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవన నిర్మాణం, ఝార్సుగుడ వీర సురేంద్ర సాయి విమానాశ్రయం రెండో దశ పునరుద్ధరణ, రౌర్కెలా, జయపురం ఎయిర్‌స్ట్రిప్‌ల విస్తరణ, బొలంగీర్‌లోని తుషురా ఎయిర్‌స్ట్రిప్ పునరుద్ధరణ, పూరీలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు, కటక్ చరబటియా ఏఆర్‌సీ పూర్తి స్థాయి పౌర విమానయాన ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ, ప్రతిపాదనలతో వినతి పత్రం అందజేశారు. ఢెంకనాల్ ప్రాంతంలో బిరాసల్, సంబల్‌పూర్‌లో హిరాకుద్, గంజాం జిల్లాలో రొంగైలుండా, జగత్‌సింగ్‌పూర్ జిల్లా పారాదీప్, కలహండిలోని ఉత్కెలా, జాజ్‌పూర్‌లో కళింగ నగర్, కెంజొహర్‌లో రాయిసువాన్, బర్‌గడ్ జిల్లా పదంపూర్, మయూర్‌భంజ్ జిల్లా రాస గోబింద్‌పూర్, రాయిరంగపూర్‌లోని విమానాశ్రయాలను ఉడే దేశ్ కీ ఆమ్ ఆద్మీ (ఉడాన్) పథకంలో చేర్చాలని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment