నాటుసారా, బెల్టుషాపులపై ప్రత్యేక దృష్టి
● వేర్వేరు ప్రాంతాల్లో 3 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం ● జిల్లా ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషర్ ఎం.రవికుమార్ రెడ్డి
మాచర్ల: రాష్ట్ర వ్యాప్తంగా నాటుసారా, గంజాయి విక్రయాలు నియంత్రించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషర్ ఎం.రవికుమార్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం పట్టణంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఉమ్మడి జిల్లాల ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేక దాడుల అధికారులు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో మాచర్ల నియోజక వర్గంపై ప్రత్యేక దృష్టి సారించి వెల్దుర్తి, దుర్గి మండలాల్లోని వివిధ తండాల్లో దాడులు నిర్వహించి 3 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు ఆయన చెప్పారు. దుర్గి మండలంలోని ఓబులేశునిపల్లె గ్రామంలో రెండు లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని ఓ వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. నియోజకవర్గంలో 17 మద్యం బెల్టు షాపుల పై దాడులు చేసి 55 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని 17 మంది నిర్వాహకుల పై కేసులు నమోదు చేశామన్నారు. రాబోయే రోజుల్లో నాటుసారా, బెల్టుషాపుల నిర్వాహణ పై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి అమ్మకందారులపై ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఐదు బృందాల ద్వారా తాము దాడులు చేసి తెలంగాణా ప్రాంతం నుంచి అధికంగా మద్యం ఈ ప్రాంతానికి సరఫరా అవుతున్నట్లు ఆయన చెప్పారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మణికంఠ, గద్దె సూర్యనారాయణ, రేఖ, శ్రీనివాసమూర్తి, స్థానిక ఎకై ్సజ్ సీఐ వెంకటరమణలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment