జూడో పోటీలకు కార్నెల్‌బాబు ఎంపిక
నరసరావుపేట రూరల్: సౌత్ అండ్ వెస్ట్ జోన్ జూడో పోటీలకు ఎన్‌ఈసీ విద్యార్థి సి.హెచ్.కార్నెల్‌బాబు ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. విజయవాడలోని శ్రీ పొట్టిశ్రీరాములు సీఎంరావు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జేఎన్‌టీయూకె అంతర్ కళాశాలల జూడో ఎంపిక పోటీలలో కార్నెల్‌బాబు ప్రతిభ కనబర్చినట్టు వివరించారు. ఈనెల 27వ తేదీ 30వ తేదీ వరకు భోపాల్‌లోని ఎన్‌ఎన్‌సీటీ యూనివర్సిటీలో నిర్వహించనున్న సౌత్‌అండ్ వెస్ట్‌జోన్ పోటీలలో కార్నెల్‌బాబు జేఎన్‌టీయూకెకు ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. వర్సిటీ జట్టుకు ఎంపికై న కార్నెల్‌బాబును కళాశాల చైర్మన్ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, వ్యాయామ అధ్యాపకులు ఎల్. కృష్ణారెడ్డి, ఎన్.ఆంజనేయులు, పి.విజయకుమార్‌లు అభినందనలు తెలిపారు.
హిందీ భాషకు ప్రోత్సాహం అవసరం
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో హిందీని ప్రోత్సహించటానికి కృషి చేయాలని గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ ఎం.రామకృష్ణ అన్నారు. పట్టాభిపురంలోని డీఆర్‌ఎం కార్యాలయంలో శుక్రవారం ఏడీఆర్‌ఎం సైమన్ అధ్యక్షతన అధికార భాషా అమలు కమిటీ సమావేశం జరిగింది. ముందుగా ప్రముఖ హిందీ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. డీఆర్‌ఎం మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని అన్ని కార్యాలయాల్లో అధికార భాషకు సంబంధించిన ప్రగతి నివేదికను సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment