ఖోఖోలో కారెంపూడి విద్యార్థుల సత్తా
కారెంపూడి: రాష్ట్రంలో ఏ మండలం నుంచి ఎంపిక కాని విధంగా కారెంపూడి మండలం నుంచి పది మంది రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. నేటి నుంచి పల్నాటి రణస్థలి కారెంపూడిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో సొంత గడ్డపై వారంతా ఆడనున్నారు. మండలంలోని ఒప్పిచర్ల జెడ్పీ హైస్కూల్ నుంచి బొమ్మనబోయిన లక్ష్మీప్రసన్న, షేక్ మహిమున్నీసా, మిద్దెపోగు రవికిరణ్, వీరదాసు మనోహర్‌లు కారెంపూడి బ్రహ్మనాయుడు జెడ్పీ హైస్కూల్ నుంచి ఎస్ వరప్రసాద్, వి.సాయి నాయక్, బి.జాన్ జీవన్, ఎం.కేశవ, డి.అఖిల్, వై అక్షితలు అండర్ 14 ఉమ్మడి గుంటూరు జిల్లా బాల బాలికల జట్లలో ఆడను న్నారు. దాదాపు ఒక్కో మండలం నుంచి ఒక్కరు కూడా లేని పరిస్ధితి చాలా చోట్ల ఉండగా కారెంపూడి విద్యార్థులు మాత్రం ఖోఖోలో తమ సత్తాచాటి ఉమ్మడి జిల్లా జిట్లలో స్థానం సంపాదించా రు. నేడు శనివారం నుంచి బ్రహ్మనాయుడు జెడ్పీ హైస్కూల్లో అట్టహాసంగా స్కూల్ గేమ్స్ ఫెఢరేషన్ ఆఫ్ ఇండియా అండర్ 14 బాల, బాలికల రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment