పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Published Sat, Nov 23 2024 10:01 AM | Last Updated on Sat, Nov 23 2024 10:01 AM

పల్నా

పల్నాడు

శనివారం శ్రీ 23 శ్రీ నవంబర్‌ శ్రీ 2024

సత్యసాయి జయంతి వేడుకలు

వినుకొండ(నూజెండ్ల): భగవాన్‌ సత్య సాయిబాబా జయంతి వేడుకలలో భాగంగా వినుకొండలో శుక్రవారం ఊరేగింపు, నగర ఉత్సవం, భజన హారతి నిర్వహించారు.

ఆలయ అభివృద్ధికి విరాళం

తాడేపల్లిరూరల్‌: కంఠంరాజు కొండూరు మహంకాళీ గుడి అభివృద్ధికి వడ్డేశ్వరానికి కె.శ్రీనివాసరావు, విజయలక్ష్మి దంపతులు రూ.1,00,006 శుక్రవారం అందజేశారు.

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం శుక్రవారం 585.10 అడుగుల వద్ద ఉంది. కుడికాలువకు 10,350 క్యూసెక్కులు వదిలారు.

27న జిల్లాస్థాయి

సంప్రదాయ నృత్యపోటీలు

నరసరావుపేట ఈస్ట్‌: బోయపాలెంలోని ప్రభుత్వ జిల్లా విద్య శిక్షణ సంస్థ (డైట్‌ కళాశాల)లో ఈనెల 27వ తేదీన జిల్లాస్థాయి సంప్రదాయ నృత్య పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి, డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఎల్‌.చంద్రకళ శుక్రవారం తెలిపారు. పల్నాడు జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థులు బాలరంగ్‌ పేరుతో నిర్వహిస్తున్న ఈ నృత్య పోటీలలో పాల్గొనేందుకు అర్హులని వివరించారు. తప్పెటగుళ్లు, కర్రసాము, చెంచులాట, థింసా, జాలరి, బంజారా అంశాలలో పోటీలు ఉంటాయని తెలిపారు. నృత్య సమయం 10 నిమిషాలు కాగా, ఒక్కో బృందంలో 10 మంది విద్యార్థులు ఉండవచ్చన్నారు. జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్‌ తమ విద్యార్థులు పోటీలో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. వివరాలకు డైట్‌ కళాశాల అధ్యాపకుడు డాక్టర్‌ కె.ప్రసాద్‌ ఫోన్‌ నంబర్‌ 8019207528 ను సంప్రదించాలని తెలిపారు.

వైద్యశాల తనిఖీ

రొంపిచర్ల: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రవి, జిల్లా మలేరియా వైద్యాధికారి డాక్టర్‌ రవీంద్ర రత్నాకర్‌ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఫ్రైడే, డ్రైడే, ఫ్యామిలీ డాక్టర్స్‌ ప్రోగ్రాం కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. బీసీ కాలనీలోని అంగన్‌ వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. పీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్‌ పోతిరెడ్డి జగన్‌నరసింహారెడ్డి, డాక్టర్‌ నిమ్మల సాయిబాబాలతో మాట్లాడారు. సిబ్బంది పనితీరు, ఆరోగ్య కేంద్రంలో రికార్డుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

అమరేశ్వరునికి లక్ష బిల్వార్చన

అమరావతి: అమరేశ్వరాలయంలో శుక్రవారం దాతల సహకారంతో అమరేశ్వరునికి లక్ష బిల్వార్చనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. స్వామికి విశేష అలంకరణ చేసి సహస్ర నామాలతో రుత్విక్కులు అమరేశ్వరునికి లక్ష బిల్వ దళార్చన నిర్వహించారు. బాలచా ముండికా అమ్మకు లక్ష కుంకుమార్చన చేశారు.

సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో మద్యం వ్యాపారులు బరితెగించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారు. మద్యం దుకాణాల వద్ద సిట్టింగ్‌ ఏర్పాటు చేయకూడదన్న ఖచ్చితమైన నిబంధన ఉన్నా.. ఏకంగా బార్‌ అండ్‌ రెస్టారెంట్లను తలపించేలా మందుబాబులకు సకల ఏర్పాట్లు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్తగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీలో ఆ పార్టీల నాయకులే దుకాణాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. అక్రమార్జనే ధ్యేయంగా మద్యం అమ్మకాల్లో అక్రమాలకు తెరతీస్తున్నారు. కేవలం వైన్‌షాపుల్లో మద్యం మాత్రమే విక్రయించాల్సి ఉంది. దుకాణాల వద్ద మద్యం తాగడానికి నిబంధనలు ఒప్పుకోవు. అయితే దుకాణయజమానులు టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటుచేసి మద్యం తాగేందుకు వీలు కల్పిస్తున్నారు.

ఎనీ టైం మద్యం

పల్నాడు జిల్లాలో మొత్తం 129 మద్యం దుకాణాలు ఉన్నాయి. అందులో దాదాపు అన్ని షాపులు స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే నడుస్తుండగా మిగిలిన వారు అడిగినంతా ఇచ్చుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీంతో మద్యం వ్యాపారులకు అధికారపార్టీ నుంచి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. నిబంధనలు అతిక్రమించి దుకాణాల వద్దే మద్యం తాగించినా, సమయ పాలన పాటించకుండా 24 గంటలు విక్రయాలు కొనసాగిస్తున్నా అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. రాత్రుళ్లు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటుచేసి మరి మద్యం అమ్ముతున్నారు.

బెల్టుషాపులకు సరఫరా

మద్యం దుకాణాల నుంచి గ్రామాల్లో బెల్టుషాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు. మద్యం బాటిళ్లపై లేబుళ్లను తొలగించి అమ్ముతున్నారు. పట్టుబడ్డా ఏ వైన్‌షాపు నుంచి మద్యం సరఫరా అయ్యిందో తెలుసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో ఎకై ్సజ్‌ అధికారులు దాడులు చేసి బెల్టుషాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అయితే మూలాలపై అధికారులు దృష్టి సారించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బెల్టుషాపులకు మద్యం సరఫరాచేస్తే మొదట రూ.5 లక్షల జరిమానా, రెండోసారి పట్టుబడితే లైసెన్స్‌ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాటలు నీటపై రాతలేనని అధికారులు వ్యవహరిస్తున్న తీరు స్పష్టం చేస్తోంది.

‘సరుకు మా వద్ద తీసుకోకపోతే కేసే’

నరసరావుపేట ఎమ్మెల్యే వర్గమని చెప్పుకొనే మద్యం దుకాణ నిర్వాహకులు తమ వద్దే బెల్టుషాపుల వారు మద్యం కొనుగోలు చేయాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మాట వినని కొందరిపై అధికారులతో దాడి చేయించి కేసులు బనాయించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న మద్యం సిండికేట్‌ దక్కించుకున్న దుకాణాల ద్వారా బెల్టుషాపులకు మద్యం వెళ్లకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య మద్యం చిచ్చు రాజుకుంటోంది.

నరసరావుపేట ఎస్‌ఆర్‌కేటీ కాలనీలోని వైన్‌ షాపు ముందు రాత్రిపూట టేబుల్స్‌ ఏర్పాటు చేసి మద్యం సరఫరా చేస్తున్న దృశ్యాలు

7

ఇలానే ఉంటే వ్యాపారాలు చేయలేం

వైన్‌షాపుల నిర్వాహకులు దుకాణాల వద్ద మద్యం సేవించేలా వ్యవహరిస్తే తాము వ్యాపారాలు చేయలేమని, బార్లు మూసి తాళాలు అప్పగిస్తామని కొంతమంది బార్‌ యజమానులు ఇటీవల ఎకై ్సజ్‌ ఈఎస్‌ మణికంఠ వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకున్నారు. మద్యం దుకాణాల అక్రమాలపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇలానే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వ్యాపారులంతా కలసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించినట్టు తెలుస్తోంది. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని ఈఎస్‌ హామీ ఇచ్చినట్టు చెప్పుకొస్తున్నారు.

న్యూస్‌రీల్‌

పర్మిట్‌ రూం తరహా

వైన్‌ షాపుల నిర్వాహకుల

దురాగతం

ప్రభుత్వ నిబంధనలకు తూట్లు

చోద్యం చూస్తున్న అధికారులు

ఎకై ్సజ్‌ అధికారులకు బార్‌ ఓనర్స్‌

అసోసియేషన్‌ ఫిర్యాదు

మద్యం షాపుల్లో 24 గంటలూ

లిక్కర్‌ అమ్మకాలు

రాత్రి పూట ప్రత్యేకంగా సిబ్బందిని

నియమించి మరీ విక్రయాలు

బెల్టుషాపులకు మందు సరఫరాలో

కూటమి నేతల మధ్య గొడవలు

గతంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌ల ఏర్పాటుకు అనుమతించారు. పర్మిట్‌ రూమ్‌కు ప్రభుత్వ నిర్దేశించిన ఫీజు సుమారు రూ.4 లక్షల వరకు ఉండేది. అయితే ప్రస్తుత మద్యం పాలసీలో పర్మిట్‌ రూమ్‌లకు అనుమతి లేదు. అయినా మద్యం వ్యాపారులు అనధికార పర్మిట్‌ రూమ్‌లను నిర్వహిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి సైతం గండి పడుతోంది. వైన్‌షాపు యజమానులు దుకాణాల వద్ద గ్లాసులు, లూజ్‌ మినరల్‌ వాటర్‌ అమ్ముకొనేవారికి నెలకు సుమారు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు అద్దెకు ఇచ్చారు. అలాగే అనధికారికంగా వైన్స్‌లకు అనుబంధంగా రెస్టారెంట్లను నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా మందుబాబులకు బిర్యానీ, మాంసాహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు. ఇలా అన్ని వైన్స్‌ దుకాణాల యజమానులు తమ దుకాణాల వద్ద అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత భారీ మొత్తంలో అద్దె చెల్లించేందుకు ముందుకు వస్తున్నారంటే మద్యం దుకాణాల వద్ద ఏ మేరకు రద్దీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
పల్నాడు1
1/8

పల్నాడు

పల్నాడు2
2/8

పల్నాడు

పల్నాడు3
3/8

పల్నాడు

పల్నాడు4
4/8

పల్నాడు

పల్నాడు5
5/8

పల్నాడు

పల్నాడు6
6/8

పల్నాడు

పల్నాడు7
7/8

పల్నాడు

పల్నాడు8
8/8

పల్నాడు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement