ముత్తూట్ ఫైనాన్స్ రెడ్ బ్రాంచ్ వద్ద ఆందోళన ● పరారీ
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ రెడ్ బ్రాంచ్‌లో నగదు మళ్లింపు వ్యవహరంపై ఆందోళన కొనసాగుతోంది. శుక్రవారం ఖాతాదారులు బ్రాంచ్‌కు చేరుకొని తమ బంగారు నగలు ఇవ్వాలంటూ పట్టుబట్టారు. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం వేరే ఖాతాదారుల పేర్లతో రిజిస్టర్ చేసి అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్ని రోజులైనా ఖాతాదారులకు బంగారం కుదవ పెట్టుకున్నట్లు రశీదు ఇవ్వకుండా, నగదు చెల్లించినా రశీదులు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో పాటు ఖాతాదారులు అప్పు చెల్లించేందుకు వచ్చి బంగారు ఆభరణాలు ఇవ్వమంటే ఆన్‌లైన్ పనిచేయడం లేదంటూ రోజులు తరబడి తిప్పుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఖాతాదారులు గట్టిగా నిలదీయడంతో అసలు మీ పేరు మీద బంగారం రిజిస్టర్‌లో లేదని, వడ్డీ ఎక్కువ కట్టాలని పొంతన లేని సమాధానాలు చెబుతూ కాలయాపన చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం ముత్తూట్ విజిలెన్స్ సెల్ 15 మందిని విచారణ చేయగా, రూ.17 లక్షలు అవకతవకలు జరిగినట్టు తేలింది. కాగా, ఇప్పటి వరకు సుమారు రూ.40 లక్షల వరకు మోసం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే గోల్డ్ డిస్పర్‌మెంట్ ఆఫీసర్ గోపీనాథ్ పరారీలో ఉండగా ఆయనపై బ్రాంచ్ మేనేజర్ ఆదినారాయణ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహరంలో బ్రాంచ్ మేనేజర్ ఆదినారాయణ పాత్రపైనా ఖాతాదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ వ్యవహరాలపై ఎలాంటి కేసులూ నమోదు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment