ఎయిమ్స్ స్నాతకోత్సవానికి ప్రముఖులు
మంగళగిరి: అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ప్రథమ స్నాతకోత్సవం ఈ నెల 17వ తేదీన మంగళగిరిలో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఐఎస్‌డబ్ల్యూ అధికారి ఆరిఫ్ హఫీజ్ అధికారులు ఏర్పాట్ల తీరును పరిశీలించారు. రాష్ట్రపతి ఎయిమ్స్‌కు చేరుకునే ప్రవేశ ద్వారం నుంచి బస చేసే ప్రాంతం వరకు, ఆడిటోరియంలో జరిగే వేడుకల సందర్భంగా తీసుకోవలసిన భద్రతా చర్యలపై అధికారులకు వారు పలు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సవానికి ఉదయం 10 గంటలలోపు ఆహూతులు వచ్చేలా ఎయిమ్స్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఫైర్ సేఫ్టీ వెహికల్‌ను అందుబాటులో ఉంచాలని సూచించారు. పాల్గొనేందుకు వచ్చే వీఐపీలు, అధికారులు, ప్రముఖుల వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపైనా సూచనలు చేశారు. కార్యక్రమానికి అవసరమైన పబ్లిక్ అడ్రసు సిస్టమ్ ఎల్‌ఈడీ, లైవ్ టెలీకాస్ట్ పరికరాలు ముందస్తుగానే అమర్చి కండీషన్ సరి చూసుకోవాలన్నారు. అధికారులకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. 162 బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ, రైల్వే గుంతకల్ ఎస్పీ రాహుల్ మీనా, గ్రే హౌండ్స్ ఎస్పీ సునీల్ షారోన్, జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, ఎయిమ్స్ డెప్యూటీ డైరెక్టర్ శశికాంత్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎస్‌ఓ పి.కోమలి పద్మ, ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ నటరాజ్, అడిషనల్ ప్రొఫెసర్ శంకరన్ తదితరులు పాల్గొన్నారు.
హాజరుకానున్న రాష్ట్రపతి ముర్ము, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ 17న నిర్వహణకు అధికారుల ముమ్మర ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment