నరసరావుపేటటౌన్: జాతీయ లోక్ అదాలత్‌లో 279 కేసులు పరిష్కారం కాగా, కక్షిదారులకు రూ. 3.40 కోట్లు పరిహారం లభించిందని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి, లోక్ అదాలత్ చైర్మన్ ఎన్. సత్యశ్రీ తెలిపారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అదనపు జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం అదాలత్ నిర్వహించారు. అదాలత్‌లో క్రిమినల్ 181, సివిల్ 24, చెల్లని చెక్కు 45, మోటార్ వాహనాలకు సంబంధించి 11, మనోవర్తి 18 కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కారమయ్యాయి. అదాలత్‌లో న్యాయ మూర్తి టి.ప్రవల్లిక, అదాలత్ సభ్యులు, న్యాయవాదులు బ్లెసీనా, సురేష్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment