గుంటూరు రూరల్: వర్గీకరణ క్రిమిలేయర్ విధానం ద్వారా మాలల అంతానికి రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ కుట్రలు పన్నుతున్నారని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవీ ప్రసాద్ విమర్శించారు. వర్గీకరణ, క్రిమిలేయర్ విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు రూరల్ మండలం నల్లపాడులో రాష్ట్రస్థాయి మాలల మహాగర్జన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. జేఏసీ చైర్మన్ దేవీ ప్రసాద్ అధ్యక్షత వహించగా బీఆర్ అంబేడ్కర్ ముని మనుమడు యశ్వంత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. విజయవాడలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయటం సంతోషకరమన్నారు. ఆ విగ్రహం ఉన్న గ్రౌండ్‌ను కమర్షియల్ గా మార్చేందుకు ప్రస్తుత సర్కారు కుట్ర చేస్తోందని విమర్శించారు.
మహాగర్జన
Comments
Please login to add a commentAdd a comment