No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, Dec 16 2024 1:57 AM | Last Updated on Mon, Dec 16 2024 1:57 AM

No He

No Headline

నరసరావుపేట రూరల్‌: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వర స్వామి దేవస్థానం ఆరుద్రోత్సవానికి ముస్తాబైంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించే తిరునాళ్ల తరువాత ఆలయంలో నిర్వహించే అతిపెద్ద కార్యక్రమం ఆరుద్రోత్సవం. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఆరుద్రోత్సవంలో పాల్గొంటారు. దీంతో పాటు కోటయ్య మాలధారులు కొండకు చేరుకుని మాలవిరమణ చేపడతారు. ఇందుకోసం ఆలయంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుద్దీపాలు, పూలతో అలంకరించారు. సోమవారం అర్ధరాత్రి నుంచి స్వామికి విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటుచేశారు.

మహారుద్రాభిషేకం

ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని త్రికోటేశ్వర స్వామికి మహారుద్రాభిషేకాన్ని విశేషంగా నిర్వహించనున్నారు. ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, సుగంధ వ్రవ్యాలు, విభూది, గంధం, కుంకుమ, తైలం, అన్నాభిషేకం నిర్వహించిన అనంతరం స్వామికి విశేష అలంకరణలు చేయనున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభమయ్యే అభిషేకాలు తెల్లవారుజాము వరకు కొనసాగుతాయి. ఆలయ యాగశాలలో మంగళవారం ఉదయం 8 గంటలకు గణపతి హోమం, రుద్రహోమం, శాంతి హోమం, వాస్తు హోమం, పుర్ణాహుతి జరుగనున్నాయి.

మాలధారులకు ప్రత్యేక ఏర్పాట్లు

కోటయ్య దీక్ష చేపట్టిన భక్తులు ఆరుద్రోత్సవం రోజున కోటప్పకొండకు చేరుకుంటారు. నరసరావుపేటతోపాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి మాలధారులు కొండకు వస్తారు. లింగంగుంట్ల కాలనీ శివాలయం నుంచి భక్త బృందం కాలినడకన కొండకు చేరుకుని ఇరుముడులు స్వామికి సమర్పించి మాల విరమణ చేస్తారు. మాలధారుల కోసం ఆలయం వెనుక ఉన్న అభిషేక మండపంలో ఏర్పాట్లు చేశారు. అలాగే మాలధారులకు జ్యోతిదర్శనం ఏర్పాటు చేశారు.

భక్తులకు అన్నదానం

ఆరుద్రోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. గత కొన్నేళ్లుగా భక్తుల సహకారంతో అన్నప్రసాదాల పంపిణీ చేపడుతున్నారు. నరసరావుపేటకు చెందిన తాళ్ల వెంకటకోటిరెడ్డి, శీలం జయరామిరెడ్డి, అల్లు రమేష్‌ ఏటా భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
No Headline1
1/1

No Headline

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement