గుంటూరు జీజీహెచ్‌లో మరో భవనం
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలోని డాక్టర్ పొదిల ప్రసాద్ జింకానా సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో జింకానా సహకారంతో రూ. 10 కోట్ల వ్యయంతో అదనంగా రెండు అంతస్తుల భవనం నిర్మించనున్నారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా శంకుస్థాపన పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ... ఒక డాక్టర్‌కు మెడలో స్టెతస్కోప్ ఎలా ఉంటుందో, గుంటూరు జీజీహెచ్‌కు జింకానా సేవలు ఒక మణిహారంలా ఉన్నాయని చెప్పారు. జింకానా డోనర్స్ సభ్యులను అభినందించారు. జింకానా సభ్యుల విరాళాలు రూ. పది కోట్ల వ్యయంతో రెండు అంతస్తుల నిర్మాణం, రూ.వంద కోట్లతో తల్లీపిల్లల విభాగం, నాట్కో సహాయంతో క్యాన్సర్ వార్డు నిర్మాణం తదితర పనులు జరుగుతున్నాయని తెలిపారు. గుంటూరు వైద్య కళాశాలలో చదివిన వారు జింకానా పేరుతో తమ కళాశాల అభివృద్ధికి చేస్తున్న సేవలు దేశవ్యాప్తంగా ఆదర్శనీయమని చెప్పారు. వీరికి డాక్టర్ పొదిల ప్రసాద్ నేతృత్వం అభినందనీయం అని వెల్లడించారు. డాక్టర్ పొదిల ప్రసాద్‌కు, జింకానా సభ్యులు, బిల్డింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ సాగి రెడ్డి బాబురెడ్డికి గుంటూరు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. విరాళాలను సక్రమంగా ఉపయోగించేలా చూస్తామన్నారు. డాక్టర్ పొదిల ప్రసాద్ మాట్లాడుతూ.. కన్నతల్లి, జన్మభూమికి ఎంత ఇచ్చినా రుణం తీరదని పేర్కొన్నారు. జింకానా విజయవంతం వెనుక పటిష్టమైన వ్యవస్థ కారణమని తెలిపారు. జింకానా కో ఆర్డినేటర్లు డాక్టర్ నూతక్కి వేంకటేశ్వరరావు, డాక్టర్ బసవ పున్నయ్య, డాక్టర్ ప్రభాకరరావు, డాక్టర్ బాల భాస్కర్‌రావు, డాక్టర్ హనుమంతరావుల సేవలను అభినందించారు. రూ.10 కోట్ల విరాళంలో డాక్టర్ పొదిల ప్రసాద్ రూ.రెండున్నర కోట్లు ఇవ్వగా, జింకానా సభ్యులు మిగిలిన మొత్తం ఇచ్చారు. అనంతరం ప్రసాద్‌ను కేంద్ర మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు, జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, చైర్మన్ బిల్డింగ్ కమిటీ యూఎస్‌ఏ జింకానా డాక్టర్ సాగిరెడ్డి బాబురెడ్డి, నాట్కో వైస్ చైర్మన్ నన్నపనేని సదాశివరావు, తులసీ సీడ్స్ అధినేత శ్రీ రామచంద్ర ప్రభు, టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, ఏపీ ఇండ స్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీఎల్‌ఐడీసీ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యాని, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. వి.సుందరాచారి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ బి.వి.సతీష్‌కుమార్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, సీఎంఓహెచ్‌ఓ డాక్టర్ శోభారాణి, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, డాక్టర్ సయ్యద్ రసూల్, కార్పొరేటర్లు ముత్తినేని రాజేష్, పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు.
రూ. 10 కోట్లతో నిర్మాణానికి శంకుస్థాపన
Comments
Please login to add a commentAdd a comment