అమరేశ్వరుని సేవలో ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ | - | Sakshi
Sakshi News home page

అమరేశ్వరుని సేవలో ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ

Published Mon, Dec 16 2024 1:58 AM | Last Updated on Mon, Dec 16 2024 1:58 AM

అమరేశ

అమరేశ్వరుని సేవలో ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ

అమరావతి: పంచారామ క్షేత్రాల్లో ప్రథమారామమైన అమరావతిలో వేంచేసి ఉన్న బాలచాముండికా సమేత అమరేశ్వరుడిని ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ మహేష్‌ చంద్రలడ్హా కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ అర్చకులు వేద పండితులు మహేష్‌ చంద్రలడ్హాను ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమరేశ్వరస్వామికి అభిషేకాలు, బాలచాముండేశ్వరి దేవికి అష్టోత్తర కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం మహేష్‌ చంద్ర లడ్హాకు వేదపండితులు, అర్చకులు ఆశీర్వచనం అందించారు. స్వామి శేషవస్త్రంతోపాటు తీర్ధప్రసాదాలు అందజేశారు.

నీటి కుంటలో

ఫార్మసీ విద్యార్థి గల్లంతు

మేడికొండూరు : నీటి కుంటలో ఈతకు దిగిన విద్యార్థి గల్లంతైన సంఘటన మండల పరిధిలోని భీమినేని వారి పాలెం సమీపంలో ఉన్న కేసిరెడ్డి కళాశాల ఆవరణలో జరిగింది. సీఐ నాగూర్‌ మీరా సాహెబ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కేసిరెడ్డి ఫార్మసీ కళాశాలలో తెనాలికి చెందిన మూల్పూరి రంజిత్‌ (21) బీఫార్మసీ నాలుగవ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం కళాశాలకు తూర్పు వైపున మంచినీటి కుంటలో మోటార్‌ రిపేర్‌కు వచ్చింది. మరమ్మతులు చేసేందుకు కళాశాలలో పనిచేసే మెకానిక్‌ వెళుతుండగా, అతని వెంట సుమారు పది మంది విద్యార్థులు కుంట వద్దకు వెళ్లారు. వీరిలో రంజిత్‌ ఈత కొట్టడానికి కుంటలో దిగి గల్లంతయ్యాడు. మేడికొండూరు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి సమయానికి కూడా ఆచూకీ తెలియలేదు.

వైభవంగా ఇంద్రకీలాద్రి

గిరి ప్రదక్షిణ

భారీగా తరలివచ్చిన భక్తజనం

ప్రత్యేక ఆకర్షణగా కళాకారులు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షణ ఆదివారం తెల్లవారుజామున జరిగింది. దేవస్థాన ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ సుమారు 8 కిలోమీటర్ల మేర సాగింది. తొలుత ప్రత్యేకంగా పూలతో అలంకరించిన రథంపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కెఎస్‌.రామారావు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాలు, సితార సెంటర్‌, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్‌రావునగర్‌, చిట్టినగర్‌, కేటీ రోడ్డు, నెహ్రూబొమ్మ సెంటర్‌, బ్రాహ్మణ వీధి మీదగా అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణ చేరింది. కూచిపూడి, భరతనాట్యాలను చిన్నారులు ప్రదర్శిస్తూ గిరి ప్రదక్షణలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు ఆది దంపతులకు హారతులిచ్చి స్వాగతం పలకడమే కాకుండా అమ్మవారికి, అయ్య వార్లకు పండ్లు, ఫలహారాలు నివేదనగా సమర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అమరేశ్వరుని సేవలో  ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ 1
1/2

అమరేశ్వరుని సేవలో ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ

అమరేశ్వరుని సేవలో  ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ 2
2/2

అమరేశ్వరుని సేవలో ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement