తపాలా శాఖలో ‘పని సంస్కృతి’ కొనసాగాలి
తెనాలి: తపాలా శాఖలో ఇప్పుడున్న పని సంస్కృతిని ఉద్యోగులు కొనసాగించాలని పోస్ట్ మాస్టర్ జనరల్ (విశాఖ, విజయవాడ రీజియన్లు) డీవీఎస్సార్ మూర్తి సూచించారు. భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ గ్రూప్–సీ, పోస్ట్‌మ్యాన్ అండ్ ఎంటీఎస్ అండ్ బీజీడీకేఎస్ (జీడీఎస్) తృతీయ సమావేశాలు ఆదివారం ఘనంగా జరిగాయి. కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రమ్ లో ఏర్పాటైన ఈ సమావేశాలకు గ్రూప్–సీ ఏపీ సర్కిల్ అధ్యక్షుడు ఈ.హనుమంతరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా డీవీఎస్సార్ మూర్తి మాట్లాడుతూ.. టెక్నాలజీ, ప్రైవేటు కొరియర్ సర్వీ సుల పోటీని తట్టుకుని తపాలా శాఖ నిలబడటం గొప్ప విషయమన్నారు. ఉద్యోగుల అంకితభావం ఇందుకు కారణమన్నారు. గ్రూప్–సీ ఏపీ సర్కిల్ ప్రధాన కార్య దర్శి సీహెచ్ వెంకయ్య మాట్లాడుతూ రెండేళ్ల వ్యవ ధిలో అసోసియేషన్ ఏడు డివిజన్ల నుంచి 24 డివిజన్లకు విస్తరించినట్టు చెప్పారు. కార్యదర్శి నివేదికను వివరించారు. సమావేశంలో భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అనంతకుమార్ పాల్, పోస్టుమ్యాన్ అండ్ ఎంటీఎస్ ఏపీ సర్కిల్ అధ్యక్షుడు జి.బ్రహ్మయ్య, జీడీఎస్ ఏపీ సర్కిల్ అధ్యక్షుడు ఎ.వెంకటరామిరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి సంతోష్‌కుమార్ సింగ్, పోస్ట్‌మ్యాన్ అండ్ ఎంటీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఖైలీరామ్ శర్మ, బీజీడీకేఎస్ ప్రధాన కార్యదర్శి డి.చంద్రశేఖర్, బీపీఆర్‌ఏఎస్‌ఏ ప్రధాన కార్యదర్శి కాళిముత్తు కృష్ణమూర్తి తదితరులు మాట్లాడారు. తొలుత బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాయుడు సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు.
పోస్ట్ మాస్టర్ జనరల్ డీవీఎస్సార్ మూర్తి
Comments
Please login to add a commentAdd a comment