No Headline
నరసరావుపేట: ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు తన జీవితాన్నే అర్పించారని కలెక్టర్ పి.అరుణ్‌బాబు కొనియాడారు. అమరజీవి ఆత్మార్పణ దినం సందర్భంగా ఆదివారం పల్నాడు కలెక్టరేట్‌లో శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి కలెక్టర్ నివాళులర్పించారు. తెలుగు వారందరూ ఒకే చోట ఉండాలని కాంక్షిస్తూ శ్రీరాములు చేసిన త్యాగనిరతిని కొనియాడారు. డీఆర్వో ఎ.మురళి, ఆర్డీఓ కె.మధులత కలెక్టర్‌తోపాటు పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శంకరభారతీపురం విద్యార్థినులు అమరజీవిపై రూపొందించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.
పల్నాడులో..
Comments
Please login to add a commentAdd a comment