సినీఫక్కీలో గాల్లోకి ఎగిరిన కారు
యడ్లపాడు: సినీఫక్కీలో కారు గాల్లోకి ఎగిరి వంతెనపై నుంచి సర్వీసు రోడ్డుపై పడిన సంఘటన మండలంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన పులిపాక అజయ్ విజయవాడ నుంచి ఒంగోలుకు కారులో ప్రయాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి మండలంలోని వంకాయలపాడు గ్రామం సమీపంలోకి రాగానే అజయ్‌కు నిద్రమత్తుతో కారు అదుపుతప్పింది. దీంతో ఎక్స్‌ప్రెస్ హైవే పక్కనున్న గడ్డర్లకు ఢీకొని కారు గాల్లోకి ఎగిరి సర్వీసు రోడ్డులోకి వచ్చి పడింది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసం కాగా, అజయ్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది బాధితుడికి ప్రాథమిక చికిత్స నిర్వహించారు. అర్థరాత్రి కావడం, సర్వీసు రోడ్డు నిర్మానుష్యంగా ఉండటంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.
వ్యక్తికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment