సొంత ఖర్చుతో రోడ్డుపై గుంత పూడ్చివేత
పర్చూరు(చినగంజాం): పర్చూరు మండల పరిధి ఆదిపూడి గ్రామానికి చెందిన కాల్వ రఘురామయ్య సొంత ఖర్చుతో రోడ్డుపై గుంతను పూడ్డాచరు. ఆయన ద్విచక్ర వాహనంపై ఆదివారం పెదనందిపాడు నుంచి పర్చూరు వస్తుండగా అడుసుమల్లి దాటిన తరువాత బ్రిడ్జి మధ్యలో పెద్ద గుంతను గమనించారు. ఇనుప చువ్వలు బయటకు వచ్చి కనిపించాయి. వాహనదారులు ప్రమాదాల బారిన పడతారని గ్రహించిన రఘురామయ్య తన ద్విచక్ర వాహనాన్ని అక్కడే గుంతకు అడ్డుగా ఉంచారు. అక్కడి నుంచి బస్సులో పర్చూరు చేరుకొని సిమెంట్, ఇసుక కొనుగోలు చేసుకొని వెళ్లి కాంక్రీట్ కలిపి తీసుకొచ్చారు. గుంతను పూడ్చి వేసి ఆదర్శంగా నిలిచారు. ఆయనున పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment