ఎయిమ్స్‌లో ముగిసిన వర్క్‌షాప్
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎయిమ్స్‌లో రేడియో డయాగ్నోసిస్ విభాగం, అనాటమీ విభాగానికి సంబంధించి ఇమేజ్ గైడెడ్ మస్క్యులోస్కెలెటల్ ఇంటర్వెన్షన్‌లపై కాడెరిక్ వర్క్‌షాప్, శిక్షణ కార్యక్రమాన్ని రెండు రోజులపాటు నిర్వహించారు. ఇండియన్ రేడియోలాజికల్ – ఇమేజింగ్ అసోసియేషన్, ది మస్క్యులోస్కెలెటర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మధబానందకర్ మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 80 మంది ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన 10 మంది అధ్యాపకులు శిక్షణ ఇచ్చారని వెల్లడించారు. ఈ శిక్షణ పాథాలజీ చికిత్సకు కీలమని తెలిపారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీమంత్ కుమార్ దాస్, డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ జైరాజ్ గోవిందరాజ్, డాక్టర్ జాయ్ ఘోషెల్, డాక్టర్ పృథ్వీనాఽథ్, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, డాక్టర్ యుగంధర్, డాక్టర్ మిథిలేష్, డాక్టర్ కిషోర్, డాక్టర్ చైతన్య, డాక్టర్ భావలు పాల్గొన్నారు.
ఆటో బోల్తా : నలుగురికి గాయాలు
కర్లపాలెం: ఆటో బోల్తా పడిన ఘటనలో ఇరువురికి తీవ్రంగా, మరో ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని దమ్మనవారిపాలెం పంచాయతీ మోటుపాలెం గ్రామం వద్ద చోటుచేసుకుంది. కర్లపాలెం పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఆదివారం రాత్రి నిజాంపట్నం నుంచి బాపట్ల వస్తున్న ఆటోలో ఖాజీపాలెం వద్ద నలుగురు ప్రయాణికులు ఎక్కారు. దమ్మన వారి పాలెం పంచాయతీ మోటుపాలెం గ్రామం వద్దకు రాగానే రోడ్డుపై ఉన్న రాయిపై ఆటో ఎక్కి బోల్తా పడింది. కర్లపాలెం గ్రామానికి చెందిన నక్కా దాసు, అతని కుమారుడు నోవాహుకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. దాసు, నోవాకును 108 వాహనంలో బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment