అమరజీవి త్యాగం చిరస్మరణీయం
నరసరావుపేట: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. డిసెంబరు 15న అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపధ్యంలో ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో తోటి అధికారులతో ఎస్పీ పొట్టిశ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి అమరజీవిగా నిల్చిన మహనీయుడని పొట్టిశ్రీరాములు అని కొనియాడారు. అకుంఠిత దీక్ష, నిస్వార్థం, ఏదైనా సాధించాలనే పట్టుదల, కార్యదక్షత, అలుపెరుగని పోరాటం వంటి ఎన్నో సుగుణాలను అమరజీవి నుంచి మనం నేర్చుకోవాలని, వాటిని అలవర్చుకొని, లక్ష్యాలను చేరుకోవాలని ఎస్పీ సూచించారు. ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, డీఎస్పీ నాగేశ్వరరావు, ఎస్‌బీ సీఐ బండారు సురేష్‌బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో
నివాళులర్పించిన ఎస్పీ శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment