క్వారీ కిటకిట
చేబ్రోలు: మహాశివరాత్రి సందర్భంగా వడ్లమూడి క్వారీలోని బాలకోటేశ్వరస్వామి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బాలకోటేశ్వరస్వామిని దర్శించుకుని తరించారు. ఆలయ ఆవరణకు సుమారు 15 భారీ విద్యుత్ ప్రభలు చేరుకున్నాయి. వందల సంఖ్యలో చిన్న, బాల ప్రభలు తరలివచ్చాయి. స్వామి దర్శనానికి భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ట్రైనీ ఐపీఎస్ దీక్ష ఆధ్వర్యంలో తెనాలి డీఎస్పీ జనార్దనరావు పర్యవేక్షణలో 12 మంది సీఐలు, 16 మంది ఎస్‌ఐలు, 300 మందికిపైగా పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ సతీష్‌కుమార్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఆలయ సమీపంలో అన్నదానం చేశారు. ఆలయ ప్రాంగణం వద్ద పులిహోర, పొంగలి, లడ్డూ, మజ్జిగ పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment