అమరారామం.. ఆనంద పరవశం
అమరావతి: బాల చాముండికా సమేత అమరేశ్వరస్వామి దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా బుధవారం జనసంద్రమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజామున మూడుగంటలకే స్వామికి అభిషేకాలు ప్రాంభమయ్యాయి. అప్పటికే క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ప్రథమ దర్శనం కల్పించారు. అమరేశ్వర స్నానఘట్టంలో భక్తులు పితృదేవతలకు కార్యాలు జరిపించుకున్నారు. జంగమదేవర ఆశీర్వచనాలు పొందారు. రాత్రి లింగోద్భవ కాలంలో అర్చకులు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఈవో సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ప్రసాదాన్ని, తాగునీటిని అందించారు. బుధవారం 20 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్టు అంచనా.
దర్శించుకున్న వీఐపీలు
అమరేశ్వరుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయ మూర్తులు జ్యోతిర్మయి, సుమతి, రవినాథ్ తివారి, రిటైర్డ్ న్యాయమూర్తి శ్యాంప్రసాద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు ఆర్‌పీ ఠాకూర్, డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మె ల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, భాష్యం ప్రవీణ్, జగన్‌మోహనరావు, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తదితరులు దర్శించుకున్నారు.
అమరారామం.. ఆనంద పరవశం
Comments
Please login to add a commentAdd a comment