నరసరావుపేట: కృష్ణా–గుంటూరు పట్టభ ద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. పల్నాడు జిల్లాలోని 56,964 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 90 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పురుషులు 37,831 మంది, మహిళలు 19,129 మంది, ఇతరులు నలుగురు ఓటర్లుగా ఉన్నారు. 38 మంది మైక్రో అబ్జర్వర్లతో కలిపి పీవో, ఏపీవోలు, ఓపీవోలు 270 మంది ఎన్నికల విధులను నిర్వహించనున్నారు. పోలింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పి.అరుణ్‌బాబు మంగళ, బుధవారాల్లో పరిశీలించారు. స్థానిక ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల నుంచి పోలింగ్ సామగ్రిని పీవోలు, ఏపీవోలు, పోలింగ్ సిబ్బందికి అందజేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 25 మంది పోటీలో ఉండగా వారిలో టీడీపీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లను చేయటంలో తలమునకలై ఉన్నారు. ఇదిలా ఉంటే ఓటరు స్లిప్‌లు ఇంటింటికి తిరిగి అందజేయాల్సిన సచివాలయ కార్యదర్శులు చాలా ప్రాంతాల్లో ఓటర్లకు ఫోన్ చేసి కార్యాలయానికి రప్పించుకొని అందజేయడం గమనార్హం.
పోలింగ్‌కు సర్వంసిద్ధం నేడు 90 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ పల్నాడు జిల్లాలోని ఓటర్లు 56,964 మంది ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, అధికారులు
Comments
Please login to add a commentAdd a comment